Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నగరిలో వైసీపీకి ఎదురుదెబ్బ.. మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీకి ఏకగ్రీవం

Nagari YSRCP setback TDP wins Municipal Chairman seat unanimously
Advertisement
  • స్వీయ ధ్రువీకరణలో తప్పులతో వైసీపీ నామినేషన్ల తిరస్కరణ
  • హైకోర్టుకు వెళ్తామన్న మాజీ మంత్రి రోజా
  • ఏకగ్రీవంగా ఎన్నిక కానున్న టీడీపీ అభ్యర్థి శ్రీనివాసన్
  • నగరి, పుత్తూరుల్లో పలు వార్డులు కూడా టీడీపీ కైవసం
Advertisement
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో, టీడీపీ అభ్యర్థి ఈ.ఎన్. శ్రీనివాసన్ ఎన్నిక లాంఛనమైంది. ఈ పరిణామం మాజీ మంత్రి ఆర్కే రోజాకు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించింది.

నగరి మున్సిపల్ చైర్మన్ పదవికి మొత్తం 13 నామినేషన్లు దాఖలు కాగా, అందులో టీడీపీ నుంచి మూడు, వైసీపీ నుంచి 10 ఉన్నాయి. సోమవారం నామినేషన్ల పరిశీలన చేపట్టిన రిటర్నింగ్ అధికారి బాలాజీ నాయక్, వైసీపీ అభ్యర్థులు సమర్పించిన 10 నామినేషన్లను తిరస్కరించారు. స్వీయ ధ్రువీకరణ పత్రాలలో సాంకేతిక లోపాలు ఉండటమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొన్నారు. దీంతో బరిలో కేవలం టీడీపీ అభ్యర్థి మాత్రమే మిగలడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

ఈ పరిణామంపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల తిరస్కరణ అనంతరం ఆమె రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని అధికారులను నిలదీశారు. ఈ విషయంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి న్యాయపోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. అధికారులు ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. కాగా, ఇదే నియోజకవర్గంలోని నగరి మున్సిపాలిటీ 4వ వార్డు, పుత్తూరు మున్సిపాలిటీ 19వ వార్డు స్థానాలు కూడా టీడీపీ ఖాతాలోకి చేరాయి.
Advertisement
Advertisement
RK Roja
Nagari Municipality
TDP
YSRCP
Chittoor District
EN Srinivasan

More Telugu News